‘తప్పుడు సమాచారం ఇవ్వాల్సిన అవసరం మాకు లేదు’

విజయవాడ: కరోనా రోగులకు వైద్యం చేస్తూ చనిపోయిన వైద్యులను సమాజం హీనంగా చూస్తూ అంత్యక్రియలు అడ్డుకొని, దాడులకు తెగబడటం హేయమైన చర్య అని ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ కార్యదర్శి తుమ్మల కార్తీక్‌ మండిపడ్డారు. బుధవారం విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... వైద్యులు తమ‌ జీవితాలను ఫణంగా పెట్టి ‌సేవ చేస్తున్నారని వారి సేవలకు గుర్తింపుగా బుధవారం సాయంత్రం 9 గంటలకు ఒక కొవ్వొత్తి వెలిగించి మద్దతు ఇవ్వాలని కోరారు. వైద్యలపై జరుగుతున్న దాడులకు నిరసనగా గురువారం డాక్టర్లు, నర్సులు, శానిటేషన్‌ సిబ్బంది నల్ల రిబ్బన్లు పెట్టుకొని విధులు నిర్వర్తించాలని తెలిపారు. వైద్యులు పై దాడి‌చేసే వారిని కఠినంగా శిక్షించేలా చూడాలని, గతంలో వైయస్ఆర్‌  హయాంలో చేసిన చట్టాలను సీఎం జగన్ ప్రభుత్వం అమలు‌ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఒడిషా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ ఒక సైనికుడి తరహాలో వైద్యులకు గుర్తింపు ఇ‍వ్వడం సంతోషకరమైన విషయమన్నారు. ఇతర రాష్ట్రాలలో కూడా ఈ గౌరవం అమలు చేయాలని కోరుతున్నామన్నారు.